దత్తన్న అలాయ్ బలాయ్‌లో 4 వేల కేజీల చికెన్‌, 12 వందల కేజీల మటన్‌

దత్తన్న అలాయ్ బలాయ్‌లో 4 వేల కేజీల చికెన్‌, 12 వందల కేజీల మటన్‌

 ఘుమఘుమలాడిన తెలంగాణా వంటలు

హైదరాబాద్‌: దసరా తర్వాత రోజు అంటే దత్తన్న అలాయ్ బలాయ్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఒక్కచోట చేర్చి దత్తన్న ఇచ్చే ఆతిథ్యం ఎప్పటిలాగే ఈసారి కూడా అద్భుతంగా సాగింది.

ఈ ఏడాది కూడా అలాయ్ బలాయ్‌లో ఆతిథ్యం, ఆహార వైవిధ్యం రెండూ కొత్త రికార్డులు సృష్టించాయి. మొత్తం 40 క్వింటాళ్ల చికెన్‌ (4,000 కేజీలు), 12 క్వింటాళ్ల మటన్‌ (1,200 కేజీలు) వండించి అతిథులను సత్కరించారు. చికెన్‌, మటన్‌ కర్రీలు, ఫ్రైలు మాత్రమే కాదు — చేపలు, రొయ్యల పులుసులు, ఫ్రైలు కూడా అలాయ్ బలాయ్ వేదికను ఘుమఘుమలతో నింపాయి.

టెలంగాణా సంప్రదాయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకేసారి 500 మంది భోజనం చేసేలా ప్రత్యేక డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేయగా, మొత్తం 8 వేల మంది భోజనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 86 రకాల వెజ్‌, నాన్ వెజ్ వంటకాలు అతిథులకు వడ్డించబడ్డాయి.

సాంస్కృతిక వాతావరణంలో 400 మంది కళాకారులు ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ అలాయ్ బలాయ్‌కు సినీ, రాజకీయ, సాహిత్య రంగాల ప్రముఖులు అందరూ రాజకీయాలకు అతీతంగా హాజరై దత్తన్న ఆతిథ్యాన్ని ఆస్వాదించారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.