అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు


తుంగతుర్తి: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) గారి అంత్యక్రియలు ఈ రోజు (శనివారం) అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది.

నిన్న (శుక్రవారం) రాత్రి ఆయన భౌతికకాయం సూర్యాపేట నుంచి తుంగతుర్తిలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఈరోజు ఉదయం నుంచే తుంగతుర్తిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో చివరి దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.

దామోదర్‌రెడ్డి అంతిమయాత్రకు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్‌ నేతలు, ప్రజా ప్రతినిధులు, వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. తన ప్రియ నాయకుడిని చివరిసారిగా చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇటీవల ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్‌ 1వ తేదీ (బుధవారం) రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు.

తన పొలిటికల్‌ జీవితం మొత్తం కాంగ్రెస్‌ పార్టీకి అంకితమైన దామోదర్‌రెడ్డి, ప్రజలకు చేరువైన నాయకుడిగా పేరుపొందారు. ఆయన మరణం పార్టీ వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచేసింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.