లక్షల రూపాయల కాంట్రాక్ట్ వృథా.. అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం
హైదరాబాద్ : రామంతపూర్ భగయత్ మూసి నాలాలో గుర్రపు డెక్క తొలగింపు పనుల కోసం లక్షల రూపాయల కాంట్రాక్ట్ మంజూరు చేసినప్పటికీ, పనులు పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమై, వాస్తవంగా గుర్రపు డెక్క తొలగింపు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపిస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, నాలాలో పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగా దుర్వాసనతో పాటు దోమల వ్యాప్తి పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు సమస్యను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని కాలనీవాసులు మండిపడుతున్నారు.
ఈ విషయంపై సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ “ఈరోజు – రేపు” అంటూ హామీలు ఇస్తూ చర్యలు తీసుకోవడం లేదని వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి విమర్శించారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
స్థానికులు కూడా వెంటనే పనులు పూర్తి చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Post a Comment