సబ్బండ వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం: డీ. వీరన్న
సబ్బండ వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం: డీ. వీరన్న
కొత్తగూడెం, జూన్ 4: సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నిరంతరం కృషి చేస్తుందని పార్టీ జిల్లా ఇంచార్జి డీ. వీరన్న అన్నారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని రైతు బజార్ సమీపంలో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పార్టీ నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘పాంచజన్యం’ సూత్రాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని డీ. వీరన్న స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, సామాజిక సమానత్వ సాధనకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్లు నవీన్ గోగికరి, ఎల్. వెంకట్, టీ. మెహన్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి నమ్మి జగదీష్, ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జి వాసం రామకృష్ణ, జిల్లా నాయకులు లకావత్ సురేష్, వాంకుడోత్ రవి, ఆదినారాయణ, సుగుణ, విజయ, శివారెడ్డి, మణెమ్మతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment