సింగరేణిలో కల్వకుంట్ల కవిత ‘బాయిబాట’.. ఈనెల 15 నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పర్యటన

 

సింగరేణిలో కల్వకుంట్ల కవిత ‘బాయిబాట’.. ఈనెల 15 నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పర్యటన

సింగరేణిలో కల్వకుంట్ల కవిత ‘బాయిబాట’.. ఈనెల 15 నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ‘‘బాయిబాట’’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా సింగరేణి అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల వద్దకు వెళ్లి కార్మికులతో నేరుగా మమేకం కానున్నారు.

ఈ పర్యటన ద్వారా సింగరేణి కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, గనుల నిర్వహణ తదితర అంశాలపై కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని వివిధ గనుల వద్ద సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు.

ఆరు రోజుల తొలి విడత పర్యటన షెడ్యూల్

బాయిబాట తొలి విడత కార్యక్రమంలో భాగంగా కవిత ఆరు రోజుల పాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు.

  • జూన్ 15: మందమర్రి ప్రాంతంలోని బొగ్గు గనుల వద్ద పర్యటన.
  • జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులతో సమావేశం.
  • జూన్ 17: ఆర్‌జీ-1 ఏరియాలో పర్యటన.
  • జూన్ 18: ఆర్‌జీ-2 ఏరియాలో కార్మికులతో భేటీ.
  • జూన్ 19: అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్తో పాటు ఆర్‌జీ-3 ఏరియాలో పర్యటన.
  • జూన్ 20: భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల వద్ద కార్మికులతో సమావేశం.

సింగరేణి ప్రాంతాల్లో కార్మికులతో నేరుగా మాట్లాడేందుకు రూపొందించిన ఈ ‘బాయిబాట’ కార్యక్రమం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని కార్మికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Blogger ఆధారితం.