వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి


మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్పల్లిలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన తల్లి కన్నబిడ్డనినే చంపేసిన ఘటన గ్రామంలో కలకలం రేపింది.

శభాష్పల్లి గ్రామానికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం జరిగింది. దంపతులకు చరణ్ (4), తనుశ్రీ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భాస్కర్‌తో కలసి ఉండలేనంటూ మమత తరచూ పుట్టింటికే వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ప్రియుడితో జీవించాలనే ఉద్దేశంతో కొడుకును తన తల్లిదగ్గరే వదిలేసి, రెండేళ్ల తనుశ్రీని మాత్రం తనతో తీసుకెళ్లింది. అయితే ప్రియుడితో భవిష్యత్తు జీవనానికి చిన్నారి అడ్డుపడుతుందనే కారణంతో మమత క్రూరమైన నిర్ణయం తీసుకుంది. అదే రోజు కూతురి గొంతునులిమి గ్రామ శివారులో పాతిపెట్టింది.

ఈ ఘోర ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

👉 కన్న తల్లి చేతిలో కూతురు హత్య కావడం అందరినీ కలచివేసింది. గ్రామస్తులు అమానుషమైన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.