భార్య మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న భర్త విషాద దృశ్యం

  

భార్య మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న భర్త విషాద దృశ్యం

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి స్టేజీ వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న భార్యను భర్త ఆసుపత్రికి తీసుకెళ్లగా, తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా ఆమె మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన వారంతా హృదయ విదారక దృశ్యానికి కన్నీళ్లు పెట్టుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం– అచ్చంపేట మండలం అక్కారం తండాకు చెందిన బాలు, కళ (35) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్న కళను శుక్రవారం ఉదయం బాలు ద్విచక్ర వాహనంపై కల్వకుర్తి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం తిరుగు ప్రయాణం మొదలైంది. ఈ సమయంలో చినుకులు మొదలవడంతో త్వరగా ఇంటికి చేరుకోవాలని బాలు బైక్‌ను నడుపుతుండగా, మార్గమధ్యంలో కళ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది.

తల రోడ్డుకు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే బాలు ఆగి భార్యను ఒడిలోకి తీసుకుని లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108కు ఫోన్‌ చేయగా, సిబ్బంది చేరుకుని ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

భార్య మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న భర్త బాలను చూసిన ప్రయాణికులు, స్థానికులు కలచివేశారు. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేశ్‌గౌడ్ తెలిపారు.

👉 ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.