హాస్టల్‌లో వ్యభిచారం.. పది మంది అమ్మాయిలు అరెస్ట్

 

హాస్టల్‌లో వ్యభిచారం.. పది మంది అమ్మాయిలు అరెస్ట్

రాంచీ (ఝార్ఖండ్): ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో సంచలనకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌ను కవర్‌గా ఉపయోగించి వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు.

సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సిటీ డీఎస్పీ కుమార్ వి.రామన్ నేతృత్వంలో లాల్‌పూర్ పోలీస్ బృందం, మహిళా పోలీసులతో కలిసి ఓం గర్ల్స్ హాస్టల్ పై దాడి చేసింది. ఈ దాడిలో హాస్టల్ మేనేజర్‌తో పాటు పది మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుని పూర్తి ముఠా గుట్టు రట్టుచేస్తామని పోలీసులు తెలిపారు.



కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.