బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి – మహబూబాబాద్ జిల్లాలో విషాదం

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి – మహబూబాబాద్ జిల్లాలో విషాదం


మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 11: కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో దసరా పండుగ సీజన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు.

వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య–స్వాతి దంపతుల కుమారుడు రితిక్ (7), అలాగే నర్సయ్య సోదరి అనిత–శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ (8) అమ్మమ్మ ఇంటికి పండగ సందర్భంగా వచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ ఒక బంధువు మరణంతో వేరే గ్రామానికి వెళ్లగా, ఈ ఇద్దరు చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు.

ఇంటి పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వారు, అప్రమత్తంగా లేక బావిలో జారి పడ్డారు. కొంతసేపటి తర్వాత బావి వద్ద చిన్నారుల చెప్పులు, బట్టలు కనిపించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే గాలింపు చేపట్టగా, ముందుగా రితిక్ మృతదేహం, తరువాత జతిన్ మృతదేహం బయటకు తీశారు.

సమాచారం అందుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి, గ్రామస్తుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో ఎంచగూడెం గ్రామం అంతా మౌనవేదనలో మునిగిపోయింది. పండుగ రోజునే ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

–🕯️ రెండు కుటుంబాల్లో శోకసంద్రం, పల్లె మొత్తానికి విషాదఛాయలు అలుముకున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.