వేములవాడలో భీమేశ్వర స్వామి దేవాలయ ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాజన్న ఆలయం నుండి ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ఊరేగింపుగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అధికారులు, అర్చకులు భక్తులను అలరించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమమని, భక్తుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలు లాంచనంగా ప్రారంభమయ్యాయి. అలాగే నిత్యాన్నదాన సత్రం పై అంతస్తులో నేటి నుండి నిత్య కళ్యాణ సేవలు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.
➡️ రాజన్న ఆలయ అభివృద్ధితో వేములవాడ భక్తి క్షేత్రం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తోందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Post a Comment