" సెల్యూట్ పోలీసన్న" ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న మహిళను కాపాడిన 100కు డైయ ల్ పోలీసులు"
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నిస్సాంపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు సమయోచితంగా స్పందించి కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే— నిస్సాంపల్లి గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు డయల్ 100కు సమాచారమిచ్చారు. కేవలం 7 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఇంటి తలుపు పగలగొట్టి జ్యోతిని కిందికి దించారు.
సమయాన్ని వృథా చేయకుండా పోలీసులు సీపీఆర్ చేసి, మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమక్షంలో ఆమెకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు.
సకాలంలో స్పందించిన పోలీసుల ఈ హ్యూమానిటీ చర్యపై గ్రామస్థులు, ప్రజలు, అధికారులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవతా విలువలతో ముందుండే పోలీసులు— సెల్యూట్ పోలీసన్న!

Post a Comment