హనుమకొండ కలెక్టరేట్‌లో సంచలనం కలెక్టరేట్‌లో కామాంధుడు!
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్‌లో ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అనే ఉద్యోగి గత కొన్నేళ్లుగా మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాజాగా ఒక మహిళా ఉద్యోగిపై అత్యాచారయత్నం చేసినట్లు తెలిసింది. కామాంధుడి బారి నుంచి బయటపడిన బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఆమె సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆమె ఫిర్యాదుపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కలెక్టరేట్‌లో ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అధికారులు విచారణ ప్రారంభించారు.
➡️ మహిళా ఉద్యోగులు భయాందోళనలో
➡️ దోషిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

Post a Comment