విధుల పట్ల ఉపాధ్యాయుని నిర్లక్ష్యం! 10 దాటినా పాఠశాల తలుపులు తెరుచుకోలేదు

విధుల పట్ల ఉపాధ్యాయుని నిర్లక్ష్యం! 10 దాటినా పాఠశాల తలుపులు తెరుచుకోలేదు


కొమురం భీం జిల్లా, అక్టోబర్ 13: విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయిస్తూ పలు పథకాలు అమలు చేస్తోంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ సంకల్పాన్ని తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి ఘటన ఒకటి ఆసిఫాబాద్ మండలంలోని బనార్ గొంది గిరిజన ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటలు దాటినా పాఠశాల తలుపులు మూసే ఉండటం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆగ్రహం రేకెత్తించింది. విద్యార్థులు ఉపాధ్యాయుల రాక కోసం పాఠశాల ఆవరణలో వేచి కూర్చోవడం చూసి పలు విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఈ ఘటనపై డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కార్తీక్ స్పందిస్తూ, “విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే ఉపాధ్యాయులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ నెలకొల్పితేనే విద్యా వ్యవస్థ గాడిలో పడుతుంది” అని అన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.