సర్పాలు ప్రకృతికి మిత్ర జీవాలు పట్టుకున్న సర్పాలు అడవిలో విడిచిపెట్టిన స్నేక్ రెస్క్యూ టీమ్‌

సర్పాలు ప్రకృతికి మిత్ర జీవాలు పట్టుకున్న సర్పాలు అడవిలో విడిచిపెట్టిన స్నేక్ రెస్క్యూ టీమ్‌


కొత్తగూడెం, అక్టోబర్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం, రామాటకీస్ ఏరియా, పాత కొత్తగూడెం, బాబు క్యాంప్, సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో ఇటీవల ఇళ్లలోకి చొరబడ్డ పాములను సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టారు.

ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ జిమ్ సంతోష్, మొబైల్ +91 94915 43291, సభ్యుడు నారదాసు శ్రీకాంత్ (చోటు) శనివారం ఈ సర్పాలను రక్షించి విడుదల చేశారు. వీటిలో నాలుగు నాగుపాములు (నాజా నాజా), ఒక నూనె కట్ల పాము (వోల్ఫ్ స్నేక్), ఒక జెర్రి పోతు (రాట్ స్నేక్) ఉన్నాయి.

ఈ సందర్భంగా జిమ్ సంతోష్ మాట్లాడుతూ "సర్పాలు ప్రకృతికి అత్యంత ఉపయోగకరమైన జీవరాసులు. ఇవి పంటలకు హాని చేసే ఎలుకలు, క్రిమి కీటకాలను నియంత్రిస్తాయి. జీవవైవిధ్య సమతౌల్యాన్ని కాపాడడంలో సర్పాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఔషధాల తయారీలో కూడా వీటి విషం ఎంతో విలువైనది" అని తెలిపారు.

అలాగే ప్రజలు ఇళ్లలో పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా, వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాణధార ట్రస్ట్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నట్టు తెలిపారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.