జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ గోదావరిఖని పర్యటన

జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ గోదావరిఖని పర్యటన


గోదావరిఖని, అక్టోబర్ 12 (ప్రతినిధి): సమాజంలో శాంతి, నైతిక విలువలు, విశ్వాసం అనే అంశాలతో “సమాజ శాంతి స్థాపనకు విశ్వాసమే మార్గం” అనే థీమ్‌తో జమాత్ ఇస్లామీ హింద్-అర్కాన్ సభ్యుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ నెల 14న గోదావరిఖని లక్ష్మీనగర్ జమా మసీద్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

మంథని, రామగుండం, మంచిర్యాల్ నియోజకవర్గాల పరిధిలోని ముస్లిం ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని అర్కాన్-కర్కునాన్ సభ్యులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గోదావరిఖని అధ్యక్షుడు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సైనీ (సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్), ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ (ఉపాధ్యక్షుడు), మహ్మద్ ఫసియుద్దీన్ (షరియత్ పంచాయితీ చైర్మన్), ముస్తఫా (వైస్ చైర్మన్), అక్బర్ (నాజిమ్ ఎ హల్కా), రెహాజుద్దీన్ (AIITA – ఆల్ ఇండియా ఐడిల్ టీచర్స్ అసోసియేషన్), ఫయాజ్ (పర్చెస్ సెల్) తదితరులు పాల్గొని బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.