రైతు బీమాకు వేళ – దరఖాస్తుల గడువు 13 వరకు
రాజన్న సిరిసిల్ల: అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న రైతు బీమా పథకం ఈసారి కూడా రైతుల రక్షణ కవచంలా ముందుకు వచ్చింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి బీమా నమోదు, పాలసీ రెన్యూవల్ ప్రక్రియలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. కొత్త పట్టాదారులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆగస్టు 13 లోపు రైతులు దరఖాస్తులు సమర్పించాలి. ఆగస్టు 14న పాలసీ రెన్యూవల్ జరగనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల రైతులు మాత్రమే అర్హులు. 60 ఏళ్లు నిండినవారు పథకం నుండి తప్పించబడతారు. ఇప్పటికే పాలసీలో ఉన్నవారు మళ్లీ దరఖాస్తు అవసరం లేదు, కానీ నామినీ మార్పులు, ఇతర వివరాల సవరణలు ఉంటే తప్పనిసరి.
పత్రాలు: పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, నామినీ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
ప్రీమియం: పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
నమోదు వర్గీకరణ:
- కొత్త పట్టాదారులు – ప్రాధాన్యం
- పాత పట్టాదారులు – వివరాల అప్‌డేట్
- ఎనిమిదో సంవత్సరం కొనసాగుతున్న అర్హులైన రైతులు – సవరణలు
- 5 ఎకరాలపై భూమి ఉన్న, ఇంకా పథకంలో లేని రైతులు – నమోదు
వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్ద దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినీ మరణం, కొత్త పాస్‌బుక్ వివరాలు వంటి మార్పులు తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించారు.
Post a Comment