సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్ – పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్ – పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్


హైదరాబాద్‌, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల కోసం పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులకు శుభవార్త. ఎన్నికల నిర్వహణకు అవసరమైన 37,530 బ్యాలెట్ బాక్సులు గుజరాత్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇవి నేడు లేదా రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఇక బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ చట్ట సభల్లో ఆమోదించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పంపగా, ఇప్పటివరకు కేంద్రం లేదా రాష్ట్రపతి నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఈ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం తెలంగాణ కాంగ్రెస్, బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా చేపట్టాయి.

అయితే కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ స్థాయిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ నెల 18న జరిగే కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో భేటీ కానుండటం, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రిజర్వేషన్లపై తుది నిర్ణయం రానున్న రోజుల్లో వెలువడే అవకాశముంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.