భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ రేపు ప్రెస్ మీట్
Oct 26, 2025 న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం రేపు (అక్టోబర్ 27, సోమవారం) సాయంత్రం 4:15 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముఖ్యమైన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ కమిషన్ అధికారికంగా ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్, అలాగే దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
దీంతో రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీహార్ మరియు తెలంగాణ రాజకీయ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణ తేదీలపై క్లారిటీ రాబోతుందనే అంచనాలతో దేశవ్యాప్తంగా మీడియా దృష్టి రేపటి ప్రెస్ మీట్‌పై కేంద్రీకృతమైంది.

Post a Comment