ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కీలక నిర్ణయం: మాస్ కాపీయింగ్‌పై ఉక్కుపాదం

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కీలక నిర్ణయం: మాస్ కాపీయింగ్‌పై ఉక్కుపాదం

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కీలక నిర్ణయం: మాస్ కాపీయింగ్‌పై ఉక్కుపాదం

విజయవాడ, మే 31: Dr. NTR University of Health Sciences పరిధిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, మెడికల్ పీజీ, ఆయుష్ కోర్సుల పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన 21 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ వెల్లడించారు.

ఏడాది పాటు డిబార్

పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 15 మంది విద్యార్థులను ఏడాది పాటు డిబార్ చేస్తున్నట్లు వీసీ తెలిపారు. వీరిలో ఆరుగురు ఎంబీబీఎస్, ఎనిమిది మంది బీడీఎస్, ఒకరు బీపీటీ విద్యార్థి ఉన్నారు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న మరో ఆరుగురు విద్యార్థులపై పరీక్షలు ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

పరీక్ష కేంద్రాలపై కూడా చర్యలు

మాస్ కాపీయింగ్‌కు అవకాశం కల్పించిన పరీక్ష కేంద్రాల యాజమాన్యాలపై కూడా వర్సిటీ చర్యలు చేపట్టింది. నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన సంబంధిత కళాశాలలకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

భవిష్యత్తులో మరింత కఠిన నిఘా

పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా మరింత కఠిన చర్యలు అమలు చేస్తామని వీసీ హెచ్చరించారు. విద్యా ప్రమాణాలను కాపాడేందుకు వర్సిటీ రాజీపడబోదని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.