ఆర్‌జీ–2 SMTCలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం.. 21 మంది ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్లకు అవగాహన
DGMS సర్క్యులర్–06/2024పై ఎలక్ట్రికల్ సిబ్బందికి ఇన్‌హౌస్ శిక్షణ
ఆర్‌జీ–2 SMTCలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం.. 21 మంది ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్లకు అవగాహన
గోదావరిఖని, అక్టోబర్ 5: గనుల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యంగా DGMS సర్క్యులర్ నెం. 06/2024పై ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, సూపర్‌వైజర్లకు ఇన్‌హౌస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్‌జీ–2 ఏరియా పరిధిలోని SMTCలో సోమవారం ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాన్ని ఆర్‌జీ–2 ఏరియా ఇంజనీర్ ఎం.వి.ఎన్.ఏ. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గనుల్లో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, DGMS మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్యక్రమంలో ఎస్.డి. జావీద్ అక్మల్ హుస్సేని, DGM (E&M), NIM, RG–2, బి. సురేందర్, EE (E&M), UMTI పాల్గొన్నారు.
అదేవిధంగా Electroburn Industriesకు చెందిన నిపుణులు కె. సత్యనారాయణ యాదవ్, రిటైర్డ్ Dy. DG (Electrical), ఎం.జి. ప్రసాద్, రిటైర్డ్ GM (E&M), SCCL, అమీన్‌ఉద్దీన్, MD, సుబ్బారావు, మాజీ Andrew Yule తదితరులు శిక్షణలో పాల్గొన్నారు. వారు ఎలక్ట్రికల్ భద్రత, సాంకేతిక అంశాలు, విద్యుత్ పరికరాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 21 మంది ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్లు పాల్గొంటున్నారు. DGMS మార్గదర్శకాలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు, గనుల్లో విద్యుత్ వ్యవస్థల నిర్వహణ, పరికరాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వారికి శిక్షణ అందిస్తున్నారు.
గనుల్లో విద్యుత్ సంబంధిత ప్రమాదాలను నివారించడంతో పాటు, భద్రతా నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఎలక్ట్రికల్ సిబ్బందికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ ఇన్‌హౌస్ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు ఎస్.డి. జావీద్ అక్మల్ హుస్సేని, DGM (E&M), NIM, RG–2 తెలిపారు.

Post a Comment