టీజీఎస్ఆర్టీసీ రాఖీ రికార్డు.. 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు

 

టీజీఎస్ఆర్టీసీ రాఖీ రికార్డు.. 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు

హైదరాబాద్‌, రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మరోసారి రికార్డు సృష్టించింది. సోదరుల మణికట్టుపై రాఖీ కట్టి తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడానికి మహిళలు భారీ ఎత్తున ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు.

ఆర్టీసీ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా, అందులో 2.51 కోట్ల ప్రయాణాలు ఉచితంగా మహిళలకు అందించబడ్డాయి. ప్రత్యేకంగా రాఖీ పండుగ రోజు (ఆగస్టు 9) మహిళా ప్రయాణికుల సంఖ్య 45.62 లక్షలు కాగా, ఆగస్టు 11న అత్యధికంగా 45.94 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి అని సంస్థ వెల్లడించింది.

గత సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా 2.75 కోట్ల మంది మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగి కొత్త రికార్డును నెలకొల్పింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, అదనపు బస్సుల ఏర్పాటు, సమయపాలన, సురక్షిత ప్రయాణం వంటి చర్యలే ఈ విజయానికి కారణమని టీజీఎస్ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.