ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కేజ్రివాల్ జన్మదిన వేడుకలు

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కేజ్రివాల్ జన్మదిన వేడుకలు


ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన అరవింద్ కేజ్రివాల్ జన్మదినాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన్ను భగవంతుడు ఆరోగ్యంతో, ఆనందంతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగించాలనీ ప్రార్థించారు.

జన్మదిన శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మీ అవుట్పల్లి రాంబాబు ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో భాగంగా ప్రైవేట్ ట్రాలీ డ్రైవర్లకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.

పార్టీ నాయకులు మాట్లాడుతూ, కేజ్రివాల్ సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, సామాన్య వర్గాలకు సౌకర్యాలు అందించడంలో ముందుండి పోరాడిన ప్రజానాయకుడని గుర్తు చేశారు. ఆయన జన్మదినం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని, ఇలాంటి వేడుకలు మరెన్నో జరగాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, డ్రైవర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.