భారీ వర్షానికి మందమర్రి లోని రైల్వే ట్రాక్ ప్సీ వరద నీరు రైళ్లు రాకపోకలకు అంతరాయం
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైల్వే ట్రాక్ పై ప్రభావం పడింది. శుక్రవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో అనేక చోట్ల నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా మందమర్రి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ వద్ద మట్టిచరులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రైల్వే అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీలించారు. ట్రాక్ పైకి మట్టి, చెత్త చేరడంతో పనితీరు దెబ్బతింది. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రైళ్లను సమీప స్టేషన్ల వద్ద నిలిపివేయగా, కొన్నింటిని మార్గమార్పు చేశారు.
స్థానిక ప్రజలు రైల్వే ట్రాక్ పక్కన భారీ వర్షపు నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ట్రాక్ మరమ్మత్తు పనులు ప్రారంభించారు. పరిస్థితి పూర్తిగా సరిచేసే వరకు రైళ్ల రాకపోకలు ప్రభావితం కావచ్చని అంచనా.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వచ్చే రెండు రోజుల పాటు మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ చేపట్టారు.
Post a Comment