కొత్తగూడెంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య వేడుకలలో పలుచోట్లా జెండా ఎగురవేసిన నాగ సితారాములు
కొత్తగూడెం పట్టణంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసి ప్రజలు దేశభక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు బీసీ కార్యాలయంలో జెండా ఎగురవేసి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, "దేశంలో స్వేచ్ఛ, సమానత్వం అత్యంత అవసరం. స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే అది నిజమైన స్వాతంత్రం అవుతుంది" అని పేర్కొన్నారు.
ఇకపై ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, "ఓటు దొంగతనానికి పాల్పడిన బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందని భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారు. అలాంటి నాయకులకు అండగా నిలిచి పోరాడాలి" అని అన్నారు.
పట్టణవ్యాప్తంగా పలు సంఘాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జెండా పండుగన సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరిపాయి.
Post a Comment