భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో మువ్వన్నెల జెండా రెపరెప వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గారు మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సంగ్రామ యోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్. సరిత, కె. కిరణ్ కుమార్, కే. కవిత, కే. సాయి శ్రీ, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జనపరెడ్డి గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఉప్పు అరుణ్, సభ్యులు చిన్నికృష్ణ, కాసాని రమేష్, మాలోత్ ప్రసాద్, మహిళా ప్రతినిధి ఆడపాల పార్వతి హాజరయ్యారు.
సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, ఏపీపీవోలు నాగలక్ష్మి, ఎన్. లావణ్య, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె. కిరణ్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, కోర్టు సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చెస్, క్రికెట్, షటిల్, కుర్చీలాట, త్రాడు లాగుడు వంటి క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు న్యాయమూర్తులచే బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఫోటో సెషన్ తో కార్యక్రమం ముగిసింది.
Post a Comment