ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క ఉండకూడదు: సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లోని వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కఠిన వైఖరి అవలంబించింది. కుక్క కాట్లు, రేబిస్ వంటి వ్యాధుల కారణంగా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, వీధి కుక్కలను తక్షణం గుర్తించి వారం లోపు షెల్టర్లకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
"రేబిస్‌తో చనిపోయిన వారిని తిరిగి ఎవరు తీసుకొస్తారు?" అని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలను కాపాడటం మొదటి కర్తవ్యమని, జంతువుల సంక్షేమం కంటే మానవ ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
వీధి కుక్కలు, వాటిని పెంచుకునే వ్యక్తుల హక్కుల మధ్య సమతుల్యత అవసరమని చెప్పినా, ప్రజల భద్రతకు భంగం కలిగించే పరిస్థితిని సహించబోమని హెచ్చరించింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏ సంస్థలు ప్రయత్నించినా కఠిన చట్టపరమైన పరిణామాలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది.
Post a Comment