సింగరేణి కార్మికులను మోసం చేసిన కవిత – HMS తో కొత్త నాటకం
భద్రాద్రి కొత్తగూడెం, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షురాలిగా 10 సంవత్సరాలు వ్యవహరించిన కల్వకుంట్ల కవిత, అధికారంలో ఉన్నంతకాలం సింగరేణిని దోచి, నాశనం చేసి, ఇప్పుడు HMS తో పొత్తు అంటూ కల్లబొల్లి మాటలు చెబితే కార్మికులు నమ్మరని సెంట్రల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ త్యాగరాజన్ మండిపడ్డారు.
కవితకు త్యాగరాజన్ వేసిన ప్రశ్నలు:
- కొత్త గనులు ఎక్కడ? – సంవత్సరానికి 5 కొత్త బొగ్గు గనులు తెరవమని హామీ ఇచ్చి, 10 ఏళ్లలో ఒక్క గని కూడా ఎందుకు ప్రారంభించలేదు?
- హామీలు ఎందుకు అమలు కాలేదు? – ఇల్లు, పర్క్స్, ఇన్‌కమ్ టాక్స్ రద్దు వాగ్దానాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నెరవేర్చలేదు?
- నిధుల దుర్వినియోగం: – సింగరేణి నిధుల నుండి 30 వేల కోట్ల రూపాయలు రాజకీయాలకు మళ్లించడం, MLAలు, మంత్రులకు కోట్లు పంచడం – ఇది BRS కాదా?
- ఎన్నికల తీర్పు: – కోల్‌బెల్ట్ ప్రాంతంలో BRS ఓటమి అవినీతి ఫలితం కాదా?
- TBGKS పరాభవం: – గుర్తింపు సంఘం హోదాలో 10 ఏళ్లు ఉన్నా, చివరి ఎన్నికల్లో పోటీ చేసే స్థితి కూడా లేకపోవడం ఎందుకు?
- కాంట్రాక్ట్ కార్మికుల సమస్య: – 22 వేల కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని మీరు చెబుతారు, కానీ అసెంబ్లీలో “ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా లేడు” అని కేసీఆర్ చెప్పిన విషయం మరిచారా?
- STPPపై హక్కు: – కవితకు STPP గురించి మాట్లాడే అర్హతే లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని:
- కాంట్రాక్టు కార్మికులకు ₹5,000 బోనస్ – దేశంలో ఎక్కడా లేని విధానం.
- పర్మినెంట్ కార్మికులకు ₹1 కోటి, కాంట్రాక్ట్ కార్మికులకు ₹40 లక్షల ప్రమాద భీమా – రూపాయి ఖర్చు లేకుండా.
- పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులందరికీ లాభాల వాటా.
- 35–40 ఏళ్ల వయో పరిమితి పెంపు – అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అమలు.
- రికార్డు స్థాయిలో ఉత్పత్తి, లాభాలు – సీఎం రేవంత్ రెడ్డి, ఉప సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో.
ఈ కార్యక్రమంలో రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, కార్పొరేట్ వైస్‌ప్రెసిడెంట్ పితాంబర్ రావు, KGM ఏరియా వైస్‌ప్రెసిడెంట్ రజాక్, కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ లలిత లక్ష్మి, నాయకులు మల్లారపు కొమరయ్య, పోషం శ్రీనివాస్, అశోక్, సైమన్, రాజశేఖర్, శ్రీనివాస్, శంకర్, వెంకటేశ్వర్లు, పవన్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment