నేటి నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి
న్యూఢిల్లీ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో టోల్ చెల్లింపు hassle లేకుండా ప్రయాణం చేయడానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ నేటి (ఆగస్టు 15) నుంచి అందుబాటులోకి వచ్చింది.
జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) వివరాల ప్రకారం, ఈ వార్షిక పాస్ ద్వారా ఒక ఏడాది పాటు లేదా గరిష్టంగా 200 ట్రిప్పుల వరకు టోల్ ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. ఈ సౌకర్యం పూర్తిగా ప్రైవేట్ వాహనదారుల కోసం మాత్రమే. కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి వాణిజ్యేతర వాహనాలు దీనికి అర్హులు.
ఈ పాస్ ధరను రూ.3,000గా నిర్ణయించారు. దేశంలోని అన్ని హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఫాస్టాగ్ రీడర్‌లు అమర్చిన టోల్ ప్లాజాల్లో ఇది చెల్లుబాటు అవుతుంది. ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్ యాప్ లేదా అధీకృత బ్యాంకుల ద్వారా ఈ వార్షిక పాస్‌ను పొందవచ్చు.
ప్రభుత్వం ఈ కొత్త సౌకర్యంతో టోల్ ప్లాజాల్లో రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని ఆశిస్తోంది.
Post a Comment