జాతీయ జెండాను ఎగురవేసిన ఎంఐఎం అధ్యక్షులు మొహీద్ పటేల్
నారాయణఖేడ్, 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు, న్యాయవాది మొహీద్ పటేల్ జాతీయ జెండాను ఎగురవేసినారు, గౌరవ వందనం అర్పించారు.
ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు, అమరవీరుల త్యాగం వలననే మనం ఈ రోజు స్వేచ్ఛా గాలిని పీలుస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి తన వంతు బాధ్యత నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు ఆలపించి, ‘వందే మాతరం’ నినాదాలతో సభ ప్రాంగణం మారుమ్రోగింది.
Post a Comment