డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సెషన్ రిపోర్టులో కీలక అంశాలు

డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సెషన్ రిపోర్టులో కీలక అంశాలు


సరోగసి పేరుతో పెద్ద ఎత్తున మోసపూరిత కార్యకలాపాలు జరిపిన డాక్టర్ నమ్రత పై దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

🔴 ప్రధాన ఆరోపణలు:

  • ఏజెంట్ల సహాయంతో పిల్లలను కొనుగోలు చేసి, దంపతులను సరోగసి పేరుతో మోసం చేసింది.
  • గర్భిణీలకు డబ్బులు ఇస్తామని ఆశ చూపి, ప్రసవం తరువాత పిల్లలను తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది.

🔴 కేసుల వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్‌లోని మహారాణిపేటలో 4 కేసులు
  • విశాఖ 2 టౌన్ పీఎస్‌లో 2 కేసులు
  • గుంటూరు కొత్తపేటలో ఒక కేసు
  • తెలంగాణలోని గోపాలవురంలో 5 కేసులు నమోదు అయ్యాయి.

🔴 ప్రభావిత నెట్వర్క్:

  • విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ ప్రాంతాలలోని కొంతమంది డాక్టర్లు, స్టాఫ్ తో కలిసి ఈ దందా నడిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

🔴 కన్ఫెషన్:

  • పిల్లల కొనుగోలుపై డాక్టర్ నమ్రత నేరాన్ని ఒప్పుకుంది.

➡️ ఈ కేసు వెలుగులోకి రావడంతో సరోగసి పేరుతో జరుగుతున్న మోసాలపై మరిన్ని దర్యాప్తులు ప్రారంభమయ్యే అవకాశముంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.