రాఖీ పండుగ సందర్భంగా సిపిఐ నేతలకు రాఖీ కట్టిన మహిళా నాయకురాలు

రాఖీ పండుగ సందర్భంగా సిపిఐ నేతలకు రాఖీ కట్టిన మహిళా నాయకురాలు


సదాశివపేట, రాఖీ పండుగను పురస్కరించుకొని సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకురాలు బూజమ్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజుద్దీన్, షఫీలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. తాజుద్దీన్ మాట్లాడుతూ, “అన్నాచెల్లెళ్ల ప్రేమ, అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ అందరికీ శుభాలు చేకూర్చాలి. సమాజంలో అందరూ అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని” ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎం.డి. ముస్తఫా, పూలమ్మ, బిపాషా, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.