మెండు రాజమల్లుకు ఘన సన్మానం చేసిన బూడిదగడ్డ బస్తీ పద్మశాలి సంఘ నాయకులు

మెండు రాజమల్లుకు ఘన సన్మానం చేసిన కొత్తగూడెం పద్మశాలి సంఘ నాయకులు


భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని బూడిదగడ్డ బస్తీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గీతాంజలి స్కూల్‌లో మార్కండేయ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా కొత్తగూడెం స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు దంపతులు, పిసికింది శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు.

పూజ అనంతరం పద్మశాలి సంఘం నేతలు మెండు రాజమల్లు దంపతులకు పుష్పమాలలు, శాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ కనుకూట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడిక్యాల సమ్మయ్య, మానవ హక్కుల రాష్ట్ర కార్యదర్శి పల్నాటి ప్రశాంత్, మామిడి కనకరాజయ్య, తుమ్మ నరసయ్య, జాగిరపు మల్లేష్, రాపల్లి రాజమౌళి, ఇంజపురి రాజేశ్వరరావు, దూడం సుధాకర్, పసుపునూటి ప్రభాకర్, తుమ్మ శ్రీనివాస్, ఇంజపూరి శివ, ఎస్. సుజాత, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇమంది ఉదయ్, మాటేంటి అశోక్, LIC కొండయ్య, గుడ్ల శ్రీనివాస్, సాహిరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.