తెలంగాణలో మరో వారం రోజుల కుండపోత వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరో వారం రోజుల కుండపోత వర్షాల హెచ్చరిక


హైదరాబాద్, గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండగా, రాబోయే ఏడు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. అలాగే 12, 13, 14, 15 తేదీల్లో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

హైదరాబాద్‌లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోత వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా తక్కువ ప్రాంతాల్లో నీటిమునిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.