FASTag వార్షిక పాస్: ఇక టోల్ ఛార్జ్ కేవలం రూ.15 – ఆగస్టు 15 నుండి అమలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు శుభవార్త! కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కొత్త వార్షిక FASTag పాస్ ప్రారంభాన్ని ప్రకటించారు. ఈ పాస్ ద్వారా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా గుండా ఒక్కసారి వెళ్లడానికి కేవలం రూ.15 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
💰 ధర & ప్రయోజనాలు:
పాస్ ధర: రూ.3000 / సంవత్సరం వాడుక: 200 ప్రయాణాలు (ఒక ప్రయాణం = ఒక టోల్ ప్లాజా క్రాస్), సాధారణంగా రూ.50 టోల్‌కు బదులుగా రూ.15కే ప్రయాణం మొత్తం రూ.7000 వరకు ఆదా రీఛార్జ్ సమస్య లేకుండా సంవత్సరానికి ఒక్కసారే చెల్లింపు పొడవైన టోల్ క్యూలలో నిలబడే ఇబ్బంది తగ్గింపు
📅 అమలు తేదీ: ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా అమలు (జాతీయ రహదారులకే వర్తింపు, రాష్ట్ర రహదారులకు కాదు)
📲 దరఖాస్తు విధానం:
రాజ్‌మార్గ్ యాత్ర యాప్
NHAI వెబ్‌సైట్: www.nhai.gov.in
MoRTH వెబ్‌సైట్: www.morth.nic.in
ℹ️ తప్పనిసరి కాదు:
వార్షిక పాస్ కొనడం ఐచ్చికం మాత్రమే. రోజువారీ ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగపడతారు. కొనకపోతే, ప్రస్తుతం ఉన్న FASTag యథాతథంగా కొనసాగుతుంది.
Post a Comment