మంచిర్యాల స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్!

మంచిర్యాల స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్!


మంచిర్యాల జిల్లా: సెప్టెంబర్ 16: నాగ్‌పూర్–సికింద్రాబాద్ మార్గంలో నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో స్టాపేజీ మంజూరైంది. జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరడంతో పాటు, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త దారులు తెరిచిందని ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలుకు స్టాపేజీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…
“ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వందే భారత్ రైళ్లు నవభారతంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. తెలంగాణకు అన్ని రకాల నిధులు అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది” అని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా, మరో రెండు రైళ్లు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే దీనిపై అనుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తనకు మంచిర్యాలతో విద్యార్థి దశ నుంచే అనుబంధం ఉందని, ఈ రోజు జిల్లా ప్రజలకు శుభవార్త అందించడం ఆనందంగా ఉందని సంజయ్ అన్నారు.

అలాగే…

  • రూ. 3.5 కోట్ల వ్యయంతో మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
  • రూ. 26 కోట్ల అమృత్ భారత్ నిధులతో స్టేషన్‌ను అత్యాధునికంగా, విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.