భద్రాచలం: రోగికి రక్తదానం – మానవత్వం చాటుకున్న దిశ ఉమెన్ ప్రొటెక్షన్ సభ్యులు
భద్రాచలం మోహన్‌రావు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కొమరం సమ్మయ్య అనే రోగికి శుక్రవారం రక్తదానం చేయడం జరిగింది. మానవత్వాన్ని మించిన సేవ మరొకటి లేదన్న తత్వంతో, దిశ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.
ఫౌండేషన్ పౌండర్ & చైర్మన్ వాసర్ల నాగమణి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు రెంటపల్లి మాధవి పర్యవేక్షణలో, జిల్లా జాయింట్ సెక్రటరీ మల్లు స్వరూప ప్రత్యేకంగా ముందుండగా, స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లు స్వరూప మాట్లాడుతూ – “ప్రాణాలను కాపాడే రక్తదానం అనేది ప్రతి మనిషి చేయవలసిన పవిత్ర కర్తవ్యమని, రోగికి అవసరమైన సమయంలో రక్తం అందించడం మానవత్వానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
ఈ రక్తదాన కార్యక్రమంలో కృష్ణ సహకారం అందించగా, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. రోగి కుటుంబసభ్యులు రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment