బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క
హనుమకొండలోని వేయిస్తంభాల గుడి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి రోజు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లాంఛనంగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.
మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పూలపండుగకు మరింత చైతన్యం తీసుకువచ్చారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ కావ్య సహా పలువురు ప్రజా ప్రతినిధులు వేడుకలకు హాజరయ్యారు.
ఆలయ ప్రాంగణం బతుకమ్మ పాటలతో మార్మోగగా, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లి సహా పలు పట్టణాల్లోనూ యువతులు, మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
పూల పండుగ తెలంగాణ సంస్కృతి, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఇంటిలో ఆనందం, సంతోషాలు వెల్లివిరియాలని మంత్రులు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు చారిత్రక, పర్యాటక ప్రదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనుంది.
Post a Comment