టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఘనంగా సన్మానించారు. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, “మహేష్ కుమార్ గౌడ్ పటిష్టమైన నాయకత్వంతో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన జనహిత పాదయాత్ర విశేష ఫలితాలు ఇస్తోంది. ఆయన కృషితో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతోంది” అని తెలిపారు.
కార్యక్రమంలో జైబాపు, జైభీమ్, జైసంవిదాన్ నాయకులు ప్రమోద్ కుమార్, సంవిదాన్ బచావ్ సభ్యుడు ఏనుగుల అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment