జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో సెప్టెంబర్ 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో కేసులను రాజీ చేసుకుని పూర్తిగా ముగించుకునే ప్రత్యేక అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కారమవుతాయి. కక్షిదారులు సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవచ్చు.


రాజీకి అనువైన కేసుల విభాగాలు

  • యాక్సిడెంట్ కేసులు
  • సివిల్ కేసులు
  • చీటింగ్ కేసులు
  • చిట్ ఫండ్ కేసులు
  • భూతగాదాలకు సంబంధించిన కేసులు
  • వివాహ బంధానికి సంబంధించిన కేసులు
  • చిన్నచిన్న దొంగతనం కేసులు
  • ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
  • కుటుంబ తగాదాలు
  • బ్యాంకు లావాదేవీల కేసులు
  • టెలిఫోన్ బకాయిల కేసులు
  • కొట్టుకున్న కేసులు
  • సైబర్ క్రైమ్ కేసులు
  • చెక్ బౌన్స్ కేసులు
  • మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులు

కోర్టు చుట్టూ తిరగకుండా తక్షణ న్యాయం

ఈ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న కేసులు పూర్తిగా క్లోజ్‌ అవుతాయి. కాబట్టి, కేసులు ఉన్నవారు, వారి బంధువులు, పరిచయస్తులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞప్తి చేసింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.