మరోసారి కార్మికులను దగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! కల్వకుంట్ల కవిత

మరోసారి కార్మికులను దగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! కల్వకుంట్ల కవిత

మరోసారి కార్మికులను దగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! కల్వకుంట్ల కవిత


హైదరాబాద్: సెప్టెంబర్ 22: సింగరేణి బొగ్గు కంపెనీ లాభాల్లో కార్మికులకు హక్కుగా ఇచ్చే వాటా విషయంలో ప్రభుత్వం మరోసారి కార్మికులను దగా చేసిందని ఆరోపణ చేసిన జాగృతి అధ్యక్షురాలు, హెచ్ ఎం ఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ ఉత్పత్తి ద్వారా సంస్థకు దాదాపు రూ.6 వేల కోట్ల నికర లాభాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. లాభాల్లో 34 శాతం వాటా కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ వాగ్దానం వాస్తవ రూపం దాల్చలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

లెక్కల ప్రకారం సింగరేణి కార్మికులకు రూ.2,040 కోట్ల లాభాల బోనస్ రావాలి. కానీ ప్రభుత్వం పలు సాకులు చెప్పి ఆ మొత్తాన్ని కుదించి కేవలం రూ.819 కోట్లకే పరిమితం చేసింది. అంటే దాదాపు 60 శాతం పైగా కార్మికుల హక్కు కత్తిరించబడినట్లే అని కార్మిక నాయకులు మండిపడుతున్నారు.

“సంస్థ విస్తరణ మంచిదే కానీ కార్మికుల శ్రమను దోపిడీ చేయడం మాత్రం క్షమించరానిది. కార్మికుల సొమ్మును పక్కదారి పట్టిస్తూ వందలు, వేల కోట్లను అభివృద్ధి పేరిట వేరే దారికి మళ్లిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటిలాగే కార్మిక వ్యతిరేక ధోరణి ప్రదర్శించింది” అని యూనియన్‌ నాయకులు విమర్శించారు.

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే పోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరిస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.