మద్దూరు మండల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
నారాయణపేట జిల్లా మద్దూరు మండల తహశీల్దార్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుని నాన్న గారి పేరు మీద వ్యవసాయ భూమిని పట్టాదారు పాస్‌బుక్‌లో చేర్చేందుకు ధృవీకరణ నివేదిక ఇవ్వడానికి అధికార సహాయం అందించాలంటే రూ.5,000/- లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం స్వీకరిస్తూ ఉన్న సమయంలోనే ACB అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు.
ప్రజలకు సూచన
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం కోరిన పక్షంలో, ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చు.
📞 టోల్ ఫ్రీ నంబర్: 1064
📲 వాట్సాప్: 9440446106
📘 ఫేస్‌బుక్: Telangana ACB
🐦 ఎక్స్ (Twitter): @TelanganaACB
🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in
👉 ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
Post a Comment