తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ కొత్త నియామకాలు – కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం

 

తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ కొత్త నియామకాలు – కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం

హైదరాబాద్‌ : దసరా పండుగ సందర్బంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ రెండో విడత జాబితాను ప్రకటిస్తూ, అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో గిరిజన నాయకుడు లకావత్ రూప్ సింగ్ నాయక్‌ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కవిత ప్రకటించిన ఈ జాబితా ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమైంది. రాష్ట్ర కార్యవర్గంలో 80 శాతానికిపైగా పదవులు బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు కేటాయించడం ద్వారా సామాజిక తెలంగాణ సాధన దిశగా ముందడుగు వేశారు.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్న కవిత, జిల్లాల వారీగా మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమై, వారి సూచనల ఆధారంగా మూడో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు.

నూతన కార్యవర్గం

  • అధ్యక్షురాలు : కల్వకుంట్ల కవిత
  • కార్యనిర్వాహక అధ్యక్షుడు : లకావత్ రూప్ సింగ్
  • ఉపాధ్యక్షులు : రియాజుద్దీన్, మంచాల వరలక్ష్మి, పుస్కూరి శ్రీకాంత్ రావు, కొట్టాల యాదగిరి, కోల శ్రీనివాస్
  • ప్రధాన కార్యదర్శి : రంగు నవీన్ ఆచారి
  • రాష్ట్ర కార్యదర్శులు : జాడి శ్రీనివాస్, గుంటి సుందర్, సేనాపతి అర్చన

జాగృతి రాష్ట్ర అనుబంధ విభాగాలు

  • కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు : జూపల్లి శ్రీనివాస్
  • వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు : వెంకటరమణ మూర్తి
  • బంజారా జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు : కేతావత్ రవీందర్ నాయక్
  • యువ జాగృతి ప్రధాన కార్యదర్శి : షేక్ హుస్సేన్
  • యువ జాగృతి ఉపాధ్యక్షుడు : నవీన్ గోగికార్
  • ఎంబీసీ ప్రధాన కార్యదర్శి : హాకింకర్ సురేందర్
  • ఎంబీసీ ఉపాధ్యక్షుడు : బొడ్డుపల్లి కోటేశ్వర చారి
  • బీసీ ఉపాధ్యక్షుడు : రుద్రారం శ్రీనివాస్ రజక

జిల్లా అధ్యక్షులు

  • రంగారెడ్డి : కప్పటి పాండురంగ రెడ్డి
  • హైదరాబాద్ : బండారి మహేందర్ ముదిరాజ్
  • వికారాబాద్ : కుమ్మరి శ్రీనివాస్
  • ఖమ్మం : గట్టు కరుణ
  • కొత్తగూడెం : దేవెళ్ల వీరన్న
  • కరీంనగర్ : గుంజపడుగు హరి ప్రసాద్
  • సూర్యాపేట : నీల ఉమారాణి (ఉపాధ్యక్షురాలు), గోవర్ధన్ ప్రజాపతి (ప్రధాన కార్యదర్శి), వీరగాని సాయి చందన్ గౌడ్ (యువ జాగృతి అధ్యక్షుడు)
  • సంగారెడ్డి : మహమ్మద్ జకీర్

నియోజకవర్గ బాధ్యులు

  • మహేశ్వరం : అడుగుల సత్యనారాయణ
  • చార్మినార్ : రాధాకృష్ణ పుప్పల
  • కార్వాన్ : కావూరి వెంకటేష్
  • ఉప్పల్ : గోపు సదానందం
  • సూర్యాపేట : నలబోలు సైదిరెడ్డి

మహిళా జాగృతి జిల్లా అధ్యక్షులు

  1. పిట్టల శ్యామల – యాదాద్రి భువనగిరి
  2. హారిక రావు – పెద్దపల్లి
  3. మంజులరావు – హనుమకొండ
  4. నూకల రాణి – వరంగల్
  5. అంకంశివరాణి – కరీంనగర్
  6. దోనకొండ సుజాత – జగిత్యాల
  7. బండారి లావణ్య – రంగారెడ్డి
  8. చిలుక మంజుల రెడ్డి – నాగర్‌కర్నూలు
  9. తినేటి సంధ్యారెడ్డి – మేడ్చల్

ఆటో జాగృతి జిల్లా అధ్యక్షులు

  1. మంచిర్యాల – వంగ సాయి కుమార్ యాదవ్
  2. నిజామాబాద్ – బి. శ్రీనివాస్
  3. కామారెడ్డి – ఎమ్.డి. అల్తాఫ్
  4. కరీంనగర్ – ఎన్. నర్సింహా నాయక్
  5. సిరిసిల్ల – వీరబత్తిని రమేష్
  6. వరంగల్ – కేతిరి సంతోష్ కుమార్
  7. హనుమకొండ – గుగులోత్ దేవేందర్ నాయక్
  8. మహబూబాబాద్ – బి. కళ్యాణ్ నాయక్
  9. కొత్తగూడెం – నొకుర్తి రాంబాబు
  10. ఖమ్మం – బోడ శ్రీను నాయక్
  11. నల్గొండ – పులిజాల వెంకన్న
  12. సూర్యాపేట – ఎమ్.డి. ఆఖీల్
  13. యాదాద్రి భువనగిరి – తునికి భాను ముదిరాజు
  14. సిద్దిపేట్ – జి. సురేష్
  15. రంగారెడ్డి – వి. బాలాజీ నాయక్
  16. మేడ్చల్ మల్కాజ్‌గిరి – కట్రావత్ మున్నా
  17. నారాయణపేట – ఎన్. శ్రీనివాస్

👉 ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని కవిత స్పష్టం చేశారు. జాగృతి ఆశయాల సాధనలో కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.