తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కొత్త డైరెక్టర్ జనరల్‌గా చారు సిన్హా బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కొత్త డైరెక్టర్ జనరల్‌గా చారు సిన్హా బాధ్యతలు స్వీకరణ


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హా ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

చారు సిన్హా ఇప్పటికే ఈ శాఖలోనే ఉప సంచాలకురాలు, సంచాలకురాలు హోదాల్లో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. అలాగే కొంతకాలం పాటు ఇంచార్జి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ శాఖ పనితీరును సమర్థవంతంగా ముందుకు నడిపారు.

అనుభవజ్ఞురాలైన అధికారి అయిన చారు సిన్హా, తన దీర్ఘకాల సేవలో అనేక కీలక విభాగాలలో సేవలందించారు. విశ్వసనీయత, క్రమశిక్షణ, అవినీతిని అరికట్టాలనే కట్టుదిట్టమైన వైఖరితో ముందుకు సాగే అధికారి అని సహచరులు ప్రశంసిస్తున్నారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం చారు సిన్హా గారు మాట్లాడుతూ, ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించడం, అవినీతి వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం మా ప్రధాన ధ్యేయం. అవినీతి ప్రవర్తనను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పారదర్శక పరిపాలనకు కట్టుబడి పనిచేసే అవినీతి నిరోధక శాఖకు, చారు సిన్హా గారి నియామకం కొత్త దిశగా మార్గనిర్దేశం చేస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.