తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
హైదరాబాద్: అక్టోబర్ 09: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారులు గురువారం ఉదయం జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ అధికారికంగా ప్రారంభమైంది.
ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలి విడతలో 292 జడ్పీటీసీ స్థానాలు, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి 👇
📅 నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9 నుంచి ప్రారంభం
📅 చివరి తేదీ: అక్టోబర్ 11
📅 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 12
📅 నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 15
🗳️ ఎన్నికల తేదీ: అక్టోబర్ 23
📊 ఓట్ల లెక్కింపు: నవంబర్ 11 ఉదయం 8 గంటలకు ప్రారంభం.

Post a Comment