భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన ప్రకారం ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం
అక్టోబర్ 26, 2025 – ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను మరోసారి వాతావరణ వ్యవస్థ ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం మెల్లగా వాయువ్య దిశగా కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు సుమారు 6 కి.మీ. వేగంతో కదిలిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఇది తుఫాన్‌గా, అలాగే మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాన్ ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు సూచించింది.
దీని ప్రభావంతో రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రలో — విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కొంతవరకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో — భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
పల్లెటూర్లు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపలవేటకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. పాలన యంత్రాంగం అప్రమత్తమై, తుఫాను దిశ, తీవ్రతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

Post a Comment