ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం నాడు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం భద్రతపై తనిఖీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఆ క్రమంలో ఈ రోజు గోడౌన్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు.
తనిఖీలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించిన ఆయన, గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనుమతి లేకుండా ఎవరినీ గోడౌన్‌లోకి అనుమతించరాదని అధికారులతో పాటు భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తనిఖీ రిజిస్టరులో సంతకం చేశారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కొత్తగూడెం రెవిన్యూ డివిజనల్ అధికారి డి. మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment