ప్రెస్ మీట్‌లో హెచ్‌ఎమ్‌ఎస్ నేత ఆగ్రహం నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి


ప్రెస్ మీట్‌లో హెచ్‌ఎమ్‌ఎస్ నేత ఆగ్రహం నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి
AITUC ద్వంద వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు

సింగరేణి, నవంబర్ 10: సింగరేణి 8 ఇంక్లైన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు హింద్ మజ్దూర్ సభ (HMS) ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా HMS డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోసికా అశోక్ మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కుంచించే నల్ల చట్టాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అతను మాట్లాడుతూ, “AITUC ద్వంద వైఖరి ఆందోళన కలిగిస్తోంది. గేట్ బయట కౌన్సిలింగ్ రద్దు కోరుతూ ఉద్యమం చేయడం, లోపల వల్లే కౌన్సిలింగ్‌కు మద్దతు ఇవ్వడం సరైంది కాదు. ఇలాంటి పద్ధతులు కార్మిక సమైక్యతకు భంగం కలిగిస్తాయి. ఈ విధానాన్ని మానుకోవాలి” అని హితవు పలికారు.

అలాగే ఆయన మాట్లాడుతూ, “16/20 మాస్టర్స్ రద్దు చేసినట్టు సర్క్యులర్ వెంటనే విడుదల చేయాలని” డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రెస్ మీట్‌లో సెంట్రల్ సెక్రటరీలు ఇస్మాయిల్, అయ్యాజుద్దీన్, అడ్రియాల ఇన్‌చార్జ్ వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, బ్రాంచ్ సెక్రటరీ గోసిక శ్రీకాంత్, పిట్ సెక్రటరీ (ALP) రేవల్లి రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగు అంజి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రవి కుమార్, సెక్షన్ ఇన్‌చార్జ్ కిరణ్ కుమార్.టీ, సంతోష్ యాదవ్ (సర్వే), అనిల్ కుమార్, శ్రవణ్, అమీర్ (వీకేపీ మైన్) తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.