బాలల దినోత్సవం సందర్భంగా హృదయాన్ని హత్తుకునే కవిత

బాలల దినోత్సవం సందర్భంగా హృదయాన్ని హత్తుకునే కవిత


మంజుల పత్తిపాటి రచన వినూత్న ఆకర్షణ

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి–భువనగిరి జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి రచించిన కవిత ప్రస్తుతం పాఠకులను ఆకట్టుకుంటుంది. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని పిల్లల యొక్క నిర్మలత్వం, భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్ర, సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను ఆమె కవిత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

కవితలో వచ్చింది వచ్చింది నెహ్రూ జన్మదినం, తెచ్చింది తెచ్చింది బాలల దినోత్సవం” అంటూ ప్రారంభమైన పంక్తులు బాలల పండుగ ఉల్లాసాన్ని చక్కగా వ్యక్తపరుస్తాయి. “ఉదయించే కిరణాలు బాలలు, ప్రగతికి బాటలు బాలలు” అనే భావాలు పిల్లలే దేశాభివృద్ధికి పునాదులు అని సూచిస్తాయి.

అలాగే “ఆకాశాన్ని వెలిగించే నక్షత్రాలు—రేపటి బావి పౌరులు” అని భవిష్యత్ తరాలపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, “బాలకార్మిక వ్యవస్థ అంతమైన రోజే నిజమైన బాలల పండుగ” అనే పంక్తులతో సమాజానికి స్పష్టమైన సందేశాన్ని చేరవేస్తుంది.

ప్రతి ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణకు కంకణబద్ధులై, బాలకార్మిక నిర్మూలన కోసం కృషి చేయాలనే పిలుపుతో కవిత ముగుస్తుంది. పిల్లల చిరునవ్వులో ప్రపంచం ఉందని గుర్తుచేసే ఈ కవిత సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా పంచుకుంటున్నారు.

పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రచయిత్రి మంజుల పత్తిపాటి సమాజానికి స్పూర్తిదాయక సందేశాన్ని అందించారు. చరవాణి: 93470 42218.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.