ప్రకృతి హరిత దీక్షకులు నైనిక రజువా మరియు అఫాన్ జైదీ లను అభినందించిన సిఎండి
ప్రకృతి హరిత దీక్షలో భాగంగా చిన్నారుల సందేశం హృదయాన్ని హత్తిన కార్యక్రమం
రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కోల్ ఇండియా ఆధ్వర్యంలో రుద్రంపూర్‌లో నిర్వహించిన కబడ్డీ పోటీల బహుమతి ప్రదాన కార్యక్రమానికి హాజరైన సింగరేణి సిఎండి ఎన్. బలరాం నాయక్ ఐఆర్ఎస్ గారికి స్వాగత సూచకంగా మొక్కలను అందజేసిన ప్రకృతి హరిత దీక్షకులు నైనిక రజువా మరియు అఫాన్ జైదీ చిన్నారులను సిఎండి ప్రత్యేకంగా అభినందించారు.
మనకు ఆక్సిజన్, ఆహారం, ఔషధాలు, వర్షాలు అందించే ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ చేతుల్లో మొక్కలను తీసుకుని కార్యక్రమంలో పాల్గొని వారు ఆదర్శంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం శ్రీ షా లం రాజు, కళాకారులు మరియు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కూడా మొక్కలను అందజేసిన ఈ చిన్నారులు అందరి ప్రశంసలను దక్కించుకున్నారు. ప్రకృతి హరిత దీక్షను ముందుకు తీసుకెళ్లే ఈ చిన్నారుల సేవా భావం అందరికీ ప్రేరణగా నిలిచింది.

Post a Comment