నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ
పాల్వంచ: నవ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల్లో భాగంగా పాల్వంచలో ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందించారు.
ఈ కేంద్రంలో మహిళలు తాటి ఆకుల కళాకృతుల తయారీ, విక్రయాలు మరియు యూనిఫామ్స్ కుట్టడం వంటి ఉపాధి కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.1,21,600/- ఆదాయం సంపాదించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి రమా దేవినేని గారు మహిళలకు చెక్కును అందజేశారు.
చెక్కుల పంపిణీ అనంతరం రమా దేవినేని గారు మాట్లాడుతూ, “మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. అలా ఉన్న కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అరుణ, దివ్య, అలాగే సాధికార కేంద్రానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నవ మహిళా సాధికార కేంద్రం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నందుకు స్థానికులు అభినందనలు తెలిపారు.

Post a Comment